![]() |
![]() |

కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. కొన్ని అలావాట్లు, ఫేవరెట్ కర్రీ, ఫేవరెట్ డ్రెస్ లాంటివి ఉంటాయి. అలాగే ఫేవరెట్ మంత్ కూడా ఉంటుంది. అయితే మార్చి అనగానే స్టుడెంట్స్ కి గుర్తొచ్చేవి పరీక్షలు, కాలేజీ వాళ్ళకి సమ్మరవ హాలిడేస్...సెలెబ్రిటీలకు వెకేషన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ పూజామూర్తికి మాత్రం మార్చి నెల సెంటిమెంట్ అంట. మరి ఎందుకు తనకి ఈ నెల ఎందుకు అంత స్పెషలో ఓసారి చూసేద్దాం.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ 2.0 లో గ్రాంఢ్ గా ఎంట్రీ ఇచ్చిన పూజామూర్తి హౌస్ లో తన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకుంది. 2.0 లో అంబటి అర్జున్, నయని పావని, భోలే షావలి, పూజామూర్తి, అశ్వినిశ్రీ లు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. "గుండమ్మ గారి కథ" సీరియల్ లొ ప్రధాన పాత్ర పోషించిన పూజామూర్తి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఎవరితోను ఎక్కువగా కలవలేకపోయింది. అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ తో ఎక్కువ సమయం ఉండటంతో కాస్త పాజిటివిటీని పొందినా అశ్వినిశ్రీతో గొడవ పెద్ద మైనస్ గా మారింది. నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తను హౌస్ లో రూడ్ బిహేవియర్ లా అనిపించింది. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసి చెప్పిన రీజన్ సరైనది కాదని అందరూ భావించారు. ఆ తర్వాత పూజామూర్తి ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది.
పూజామూర్తి ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలు , వీడియోలని పోస్ట్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రస్తుతం తను 106K ఫాలోవర్స్ ని కలిగి ఉంది. కొన్ని రోజుల క్రితం శుభశ్రీతో కలిసి ' కుకింగ్ ఛాలెంజ్ విత్ గుండమ్మ ' అనే వ్లాగ్ చేయగా.. దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అంతా బిబి మహోత్సవం షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేసింది. ప్రేమ, సంపద, మనశ్శాంతి, దయ, హీలింగ్, ప్రోగ్రెస్, బ్లెస్సింగ్స్ ఇలా అన్నీ లైఫ్ లో పొందాలని భావిస్తున్నాను అంటు పూజామూర్తి పోస్ట్ చేసింది. దీంతో పూజామూర్తి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అయితే హౌస్ లో రెండు వారాలు మాత్రమే ఉన్న పూజామూర్తి కొంత ఫ్యాన్ బేస్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే మీలో ఎంతమందికి పూజామూర్తి తెలుసో కామెంట్ చేయండి.
![]() |
![]() |